A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మహిళలకు 4 లక్షల కోట్ల ఆస్తి ఇచ్చారు
Share |
September 19 2021, 1:49 pm

ఎపిలో మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగు లక్షల కోట్ల ఆస్తిని మహిళలకు అందించారని నగరి వైసిపి ఎమ్మెల్యే రోజా అన్నారు. తిరుమలలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపిలో 28 లక్షల గృహాలు మహిళల పేరు మంజూరు చేసి సీఎం వైఎస్‌ జగన్‌ మహిళలకి అన్న అయ్యాడని ఆమె అన్నారు. దేశంలో నాలుగు ఇళ్లు నిర్మిస్తే అందులో ఒకటి ఏపీలోదే అన్నారు. సీఎం జగన్‌ 4 లక్షల కోట్ల ఆస్తిని మహిళలకు అందించారని తెలిపారు. 50 శాతానికి పైగా నామినేటెడ్ పోస్టులు మహిళలకు కేటాయించారు.. దిశ యాప్ ప్రవేశపెట్టి మహిళలకు అండగా నిలిచారని రోజా వ్యాఖ్యానించారు.

tags : roja, women assets

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info