A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రజకులు, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్
Share |
September 19 2021, 2:34 pm

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్ర
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ గురువారం
నాయి బ్రాహ్మణుల, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
పథకం అమలుపై అధికారులతో బిఆర్ కెఆర్ భవన్ లో సమీక్షా
సమావేశం నిర్వహించారు.
ఈ పథకం కింద ఇప్పటి వరకు 28550 మంది ధరఖాస్తు చేసుకోగా
10637 ధరఖాస్తులు రజకుల కమ్యూనిటీ నుండి, 17913 ధరఖాస్తులు
నాయిబ్రాహ్మణుల కమ్యూనిటీ నుండి స్వీకరించడం జరిగింది. ఈ
పథకానికి లబ్ధిదారులు తమ పేర్లు నమోదుచేసుకోవడానికి జిల్లా
కలెక్టర్లు, బిసి సంక్షేమ అధికారులు ప్రత్యేక డ్రైవ్ ను
నిర్వహించాలని ఆదేశించారు. లబ్ధిదారులు తమ ధరఖాస్తులను
ఉచితంగా మీ సేవా కేంద్రాలలో నమోదు చేసుకునేలా సౌకర్యాన్ని
కల్పించాలని ఐటి అధికారులను ఆదేశించారు. సిజిజి లో రిజిష్ట్రరు
చేసుకున్న ధరఖాస్తులను సంబంధిత అధికారులు వెంటనే సంబంధిత
Discom లకు పంపించి ఉచిత విద్యుత్ పథకాన్ని పొందేలా చర్యలు
తీసుకోవాలన్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం జివో.
ఎంస్. నెం. 2, తేది 04-04-2021 బిసి వెల్పేర్ (డి) డిపార్ట్ మెంట్
ద్వారా జారీ చేయడంతో పాటు నియమనిబంధనలు కూడ విడుదల చేసింది.
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామ కృష్ణారావు, బిసి వెల్ఫేర్
కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్
సుల్తానియా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ శ్రీ రఘునందన్ రావు,
TSSPDCL, CMD శ్రీ రఘుమారెడ్డి, బిసి వెల్ఫేర్ అడిషనల్ సెక్రటరీ శ్రీ సైదా, వాషర్ మెన్
ఎండి శ్రీ చంద్రశేఖర్,

tags : someshkumar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info