A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జార్కండ్ లో దారుణం-జడ్జి హత్య
Share |
September 19 2021, 12:42 pm

మాఫియాకు కేంద్రంగా భావించే జార్కండ్ లోని ధనబాద్ లో ఘోరం జరిగింది. ఒక న్యాయమూర్తిని కొందరు దుండగులు ఆటోతో డీకొట్టి హత్య చేశారు. చూడడానికి ఇది ప్రమాదంలా కనిపించినా, ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు బావిస్తున్నారు. హైకోర్టు కూడా సుమోటోగా ఈ కేసును విచారణకు తీసుకుంది. ధన్‌బాద్‌ జిల్లా అడిషినల్‌, సెషన్స్‌ జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ బుధవారం ఉదయం మేయిన్‌ రోడ్డుపై జాగింగ్‌ చేస్తూ ఉన్నారు. సరిగ్గా ఐదు గంటల ప్రాంతంలో రోడ్డుపై వెళుతున్న ఓ ఆటో వెనకాలనుంచి ఆయనను ఢీకొట్టింది. దీంతో ఆయన పక్కకు ఎగిరి పడ్డారు. రోడ్డు ప్రక్కన పడి ఉన్న ఆయనను గుర్తించిన కొందరు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.కాని ఆయన అప్పటికే మరణించారని వైద్యులు ప్రకటించారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు కీలకంగా మారటమే కాకుండా.. పలు అనుమానాలకు తావిస్తున్నాయి. పోలీసులు దీన్ని హత్యగా అనుమానిస్తున్నారు.

tags : judge ,murder

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info