A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దళితుల ఓట్లు గంపగుత్తకోసమే..
Share |
September 19 2021, 1:07 pm

హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికలో దళితుల ఓట్లు గంపగుత్తగా పొందడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యూహం పన్నారని ఎమ్.ఆర్.పి.ఎస్. వ్యవస్థాపకుడు , మహాజన సోషలిస్టు పార్టీ నేత మంద కృష్ణమాదిగ ఆరోపించారు. దళిత బంధు స్కీమును అక్కడ ఆగస్టు ఒకటి నుంచి ఆరంభించి పదిహేనో తేదీకల్లా పూర్తి చేయాలని, ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల నగదు అందాలని ఆయన అన్నారు. ఆగస్టు పదహారు నుంచి రాష్ట్రం అంతటా నెలాఖరుకల్లా దళిత బంధు అమలు కావాలని ఆయన అన్నారు. దళిత బంధు అమలుకోసం వివిధ జిల్లాలలో పర్యటిస్తామని, సభలలో పాల్గొంటామని ఆయన తెలిపారు. సెప్టెంబర్ ఐదున హుజూరాబాద్ లో దళిత గర్జన సభ ఉంటుందని, టాంక్ బండ్ నుంచి ఆగస్టు 16న పాదయాత్ర ప్రారంభించి సభ నాటికి చేరుకోవాలని తలపెట్టామని ఆయన చెప్పారు.

tags : manda krishna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info