A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆంద్రజ్యోతి కదనం విద్వేషపూరితం
Share |
September 19 2021, 1:26 pm

ఆంద్రజ్యోతి కదనంపై బిజెపి ఎమ్.పి ,సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టులో తన వాదన తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చడంతో పాటు, భక్తుల మనోభావాలను దెబ్బతీసి సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించిందని ఆయన హైకోర్టుకు నివేదించారు. ఈ కేసును పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును కోరారు.కథనాన్ని ప్రచురించే ముందు టీటీడీ అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదన్నారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగానే తాను ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్టు చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం.. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించింది.

tags : subrahmanya swamy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info