A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈనాడుపై బొత్స ద్వజం
Share |
September 19 2021, 1:59 pm

ఇళ్ల నిర్మాణానికి సంబందించి ఈనాడు రాసిన కధనంపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వారు కావాలని ఇలాంటి అసత్యాలు రాస్తున్నారని ఆయన విమర్శించారు. జాకీలు,క్రేన్ లు తెచ్చి చంద్రబాబును, టిడిపి ని లేపాలని ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందని, కాని వారు సఫలం కారని ఆయన అన్నారు.తాము టిడ్కో ఇళ్లను పేదలకు ఇవ్వబోతున్నామని తెలిసి,కావాలని ఏదో రకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని బొత్స అన్నారు. ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలన్నది సీఎం జగన్‌ సంకల్పమని తెలిపారు. రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఇచ్చాం. వైఎస్సార్‌ హయాంలో 21 లక్షలకు పైగా ఇళ్లను కట్టించారు. చంద్రబాబు హయాంలో 6 లక్షల ఇళ్లనే కట్టించారు. సీఎం జగన్ 28 లక్షల 30 వేల ఇళ్లు కట్టిస్తున్నారు. జగనన్న కాలనీల్లో 340 ఎస్‌ఎఫ్‌టీతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని’’ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.240 చదరపు అడుగుల ఇళ్లు మాత్రమే ఇచ్చిన చంద్రబాబు తాము 340 చదరపు అడుగుల ఇళ్లు ఇస్తుంటే పిచుక గూళ్లు అంటున్నారని ఆయన ద్వజమెత్తారు.

tags : botsa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info