A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి.లో రైతు ఆత్మహత్యలు తగ్గాయి
Share |
September 19 2021, 1:32 pm

రైతు ఆత్మహత్యలు అతి తక్కువగా నమోదయిన రాష్ట్రం తెలంగాణ అని
పార్లమెంటులో కేంద్రం వెల్లడించిన గణాంకాల నేపథ్యంలో స్పందించిన
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ఆత్మస్థయిర్యం పెరిగింది
ఆత్మహత్యలు తగ్గాయి
- కేసీఆర్ ముందుచూపుతోనే
ఇది సాధ్యమయింది
- పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ సమాధానమే దీనికి నిదర్శనం
- దేశానికి దిక్సూచి తెలంగాణ రైతు అనుకూల వ్యవసాయ విధానాలు
- వ్యవసాయ నిపుణుల సూచనలతోనే ఆరు నెలలపాటు మేధోమధనం చేసి రైతుబంధు పథకం
కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు
- వ్యవసాయరంగం బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది
- ప్రతి పౌరుడు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది
- 60 శాతం ఆధారపడిన వ్యవసాయరంగాన్ని గత ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయి ..
తెలంగాణ ప్రభుత్వం దానికి పెద్దపీట వేసింది
- రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు, సాగునీటి కల్పన, పంటల కొనుగోలుతో మద్దతుధర
మూలంగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయాయి
- 2018 లో రైతుబంధు అమలు తర్వాత 2019 లో 491 కి రైతు ఆత్మహత్యలు
తగ్గిపోయాయి ..  పార్లమెంటులో కేంద్రం ఈ సమాధానం చెప్పడం
వ్యవసాయరంగంలో తెలంగాణ ప్రభుత్వ ముందుచూపుకు నిదర్శనం
- దీనికి ముఖ్యకారణం రైతుబంధు అని చెప్పడం గమనార్హం
- రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలలో నిధులు జమచేయడం ద్వారా రైతులు
బ్యాంకుల చుట్టూ, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులకు దూరం చేయడం
మూలంగా రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగింది

- సాగునీటి కల్పన, ఉచితకరంటుతో పాటు సాగు, దిగుబడి పెరగడం మార్కెట్ లో
మద్దతుధర దక్కడం రైతులు వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేసింది
- వ్యవసాయ రంగ అనుకూల విధానాలతో కొత్త భూమి సాగులోకి రావడం,
వ్యవసాయరంగానికి దూరమయిన వారు తిరిగి సాగు చేపట్టడం జరిగింది
- గతంలో వ్యవసాయ సంక్షోభం మూలంగా ఇతర రంగాలకు మళ్లిన వారు కూడా తిరిగి
వ్యవసాయం వైపు దృష్టి సారించారు
- పెరిగిన పంటలు, పెరిగిన ఉపాధులతో తెలంగాణ గ్రామీణ అర్థిక వ్యవస్థ
పరిపుష్టి చెందింది ..
- కరోనా విపత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం చెందగా గత ఏడాది
తెలంగాణలో మాత్రం ప్రాథమిక రంగంలో 17 శాతం, వ్యవసాయ రంగంలో 20 శాతం
అభివృద్ధి నమోదు చేయడం తెలంగాణ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగానే
సాధ్యమయింది
- బ్యాంకుల ద్వారా రుణాలు దొరకని పరిస్థితి నుండి రుణాల కోసం బ్యాంకుకు
వెళ్లని పరిస్థితి తెలంగాణలో నెలకొంటున్నది
- రైతుబంధుపై రాజకీయం చేసేవారు కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించి
ఆత్మవిమర్శ చేసుకోవాలి
- కేసీఅర్ గారి నాయకత్వంలో వ్యవసాయ రంగం మాదిరిగానే భవిష్యత్ లో
దళితబంధు పథకం ద్వారా దళితులు ఆర్థిక పరిపుష్టి సాధిస్తారు
- రైతుబంధు మాదిరిగానే దళితబంధు పథకం విజయవంతమవుతుంది
- రైతు ఆత్మహత్యలు అతి తక్కువగా నమోదయిన రాష్ట్రం తెలంగాణ అని
పార్లమెంటులో కేంద్రం వెల్లడించిన గణాంకాల నేపథ్యంలో స్పందించిన
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్

tags : niranjanreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info