ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశి వ్యంగ్యాస్త్రాలు సందించారు. చంద్రబాబు కాలం చెల్లిన టాబ్లెట్ వంటి వాడని ఆయన అన్నారు.
టీడీపీలో లోకేష్ గుది బండలాంటి వాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయమన్నారు. తెలుగు తమ్ముళ్లు ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. పంచాయతీల్లో 40 శాతం ఓట్లు వచ్చాయని టపాసులు కాల్చిన తండ్రి, కొడుకులు ఏపీలో ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ముఖ్యమైనదని, చంద్రబాబు పరిషత్ ఎన్నికల నుంచి తప్పుకోవడం ఆడలేక మద్దెల ఓడు అన్న సామెతలా ఉందని ఆయన అన్నారు. తెలంగాణాలో ఓటుకు నోటు విచారణ వస్తుంది కాబట్టి టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేశాడని, ఓటుకు నోటు కేసుకు భయపడి 2024 వరకు ఏపీకి రాజధాని హైదరాబాద్లో హక్కు ఉన్నా, పారిపోయి వచ్చాడని వంశి వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో ప్రధాని మంత్రి కావాలని చూసి రాష్టంలోనే చతికిల పడ్డాడని విమర్శించారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి దడిచి టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో సిగ్గులేకుండా విలీనం చేసాడని ఆయన మండిపడ్డారు. tags : vamsi ,babu