మహారాష్ట్రలో ఈ వసూళ్ల పర్వం ఆరోపణలు మరో ఇద్దరు మంత్రులకు ముప్పు తెచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే వంద కోట్ల వసూళ్ల ఆదేశం ఆరోపణపై హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేయవలసి వచ్చింది.తాజాగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సన్నిహితుడినని , గుట్కా వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేయాలని కోరుతూ ఒక వ్యక్తి తనను కలిశాడని, ఇప్పటికే అరెస్టు అయిన పోలీసు అదికారి సచిన్ వాజే ఎన్.ఐ.ఎ.కి లేఖ రాశారు. అలాగే శివసనకు చెందిన మరో మంత్రి అనిల్ ఫరబ్ కూడా డబ్బు వసూళ్లు చేయాలని కోరానని ఆయన ఆరోపించారు. దీంతో ఈ ఇద్దరు మంత్రుల పరిస్థితి ఏమిటా అన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం గందరగోళం వైపు వెళుతోంది. tags : ministers