తలంగాణలో తలుగుదేశం పరిపూర్ణంగా జీరోకి వచ్చినట్లు ఉంది. ఆ పార్టీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార టిఆర్ఎస్ లో విలీనం కావడంతో ఆ పార్టీకి ఇక ఎమ్మెల్యేలు ఎవరూ లేకుండా పోయారు. తొలుత సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టిడిపికి దూరం అయినా, అధికారికంగా టిఆర్ఎస్ లో చేరలేకపోయారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు ఇంతవరకు పార్టీ మారడానికి ఇష్టపడలేదు. కాని తాజాగా ఆయన అంగీకరించడంతో ఇద్దరు కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి విలీనం లేఖ అందచేశారు. ఆ తర్వాత వారికి ముఖ్యమంత్రి కెసిఆర్ గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. నియోజకవర్గ అభివృద్ది కోసమే పార్టీ మారానని నాగేశ్వరరావు అన్నారు. tags : telangana,. tdp