A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ట్విట్ చేయడం సరికాదు
Share |
April 19 2021, 6:26 pm

ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విద్వేషాన్ని బయట పెట్టేసుకుంటున్నారు. కుప్పం మండలంలోని గొనుగురు వద్ద సుబ్రహ్మణ్యస్వామి ఆలయ దేవతామూర్తుల విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ద్వంసం చేసిన కేసులో ఆయన వ్యాఖ్యలు తప్పని తేలిందని చిత్తూరు ఎస్పి ప్రకటించారు. మతిస్థిమితం లేని ఓ మహిళ విగ్రహాలు ధ్వంసం చేసిందని ఆయన తెలిపారు. గుడి చాలా మారుమూల ప్రాంతంలోఉందని, వారానికి ఒకసారి మాత్రమే అక్కడ పూజలు జరుగుతాయని తెలిపారు. మతిస్థిమితం లేని మహిళ ఈ ఘటనకు కారణమని తేలిందన్నారు.ఆమె మద్యం మత్తులో ఉన్నట్లు కూడా తేలిందని ఆయన వివరించారు.జిల్లాలోని అన్ని ప్రార్థనాలయాలకు జియో ట్యాగింగ్ చేశామని, ఈ ఘటనపై కుట్ర జరిగిందనేలా చంద్రబాబు ట్వీట్ చేయడం సరికాదన్నారు. నిజానిజాలు నిర్ధారించుకుని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయకూడదని ఆయన చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టరీత్యా కేసులు తీసుకుంటామని స్పష్టం చేశారు.

tags : ap, babu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info