ఎపిలో జడ్పి, మండల ఎన్నికలను హైకోర్టు నిలుపుదల చేయడంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంతోషపడ్డారు. తాము ఈ ఎన్నికలను బహిష్కరించాలన్న నిర్ణయం తీసుకోవడం సరైనదేనని ఈ తీర్పుతో వెల్లడైందని ఆయన అన్నారు.చట్టాన్న తమ చేతిలోకి తీసుకోవాలని వైసిపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇది చెంపపెట్టు అని ఆయన అన్నారు.
ఇప్పటికైనా జగన్‌రెడ్డి ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని విడనాడి అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో వ్యవహరించాలి. నామినేషన్ల దాఖలు నుంచి ఈ ఎన్నికల ప్రక్రియను కొత్తగా మొదలుపెట్టాలి. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎన్నికల కమిషనర్ స్వతంత్రంగా వ్యవహరించాలి తప్ప రబ్బర్ స్టాంప్‌గా మారకూడదు.’అని చంద్రబాబు పేర్కొన్నారు. tags : chandrababu