ఎపిలో తెలుగుదేశం, బిజెపి, జనసేన లు కలిసి లోపాయికారిగా వ్యవహరిస్తున్నాయా అన్న అనుమానాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికల నుంచి తప్పుకోవడం, అంతర్గతంగా జనసేనకు మద్దతు ఇస్తున్నట్లు కనిపించడం, బిజెపి నేతలు ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు అవుతుందని వ్యాఖ్యానించడం మొదలైనవాటిని గమనిస్తే ఈ మూడు పార్టీలు కలిసి ఏమైనా చేయాలని అనుకుంటున్నాయా అనిపిస్తోందని ఆయన చెప్పారు. జగన్ బెయిల్ రద్దు అవుతుందని బిజెపి నేతలు ఎలా చెబుతారని, ఎవరైనా రాజ్యాంగ సంస్థలలోని వారు అందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి భావిస్తోందా అని ఆయన ప్రశ్నించారు.కోర్టులలో జరిగే విషయాలపై బిజెపి ఎలా మాట్లాడుతుందని ఆయన అన్నారు. గతంలో జగన్ ను కాంగ్రెస్,టిడిపి కలిసి ఇబ్బంది పెట్టాయని, అప్పుడే జగన్ భయపడలేదని ఆయన గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ కు ఆవేశమే తప్ప,ఆలోచన లేదని ఆయన అన్నారు. tags : sajjal