మండల, జడ్పి ఎన్నికలలో పోటీ కొనసాగించాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె తన అనుచరులకు స్పష్టం చేశారని సమాచారం.కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తన వర్గం అభ్యర్దులంతా పోటీలో ఉండాలని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు విజయం కోసం ప్రయత్నించాలని సూచించారు.
నియోజకవర్గంలో ఎక్కడా పరిషత్ ఎన్నికలను బాయ్‌కాట్ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆరు మండలాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని చెప్పారు. వారి తరఫున ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థిస్తామని తెలిపారు. పోటీలో టీడీపీ అభ్యర్థులు లేని చోట, అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన స్థానాల్లో సైకిల్ గుర్తుకు బదులు నోటాకు ఓటు వేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. tags : bhuma akhilapriya