A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమర జవాన్ల కుటుంబాలకు జగన్ అండ
Share |
April 19 2021, 4:54 pm

చత్తీస్ గడ్ లో మావోయిస్టుల దాడిలో అమరులైన జవాన్లకు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళి అర్పించారు. వారిలో ఇద్దరు ఎపికి చెందినవారు కూడా ఉన్నారు. వారి కుటుంబాలకు ముప్పైలక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాలకు చెరో రూ.30 లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సహాయాన్ని వెనువెంటనే అందించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈ ఘటనలో అమరులైన ఏపీకి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు.

tags : jagan, help

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info