A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జెసి- ఓట్లు-డబ్బు- ఆగ్రహం
Share |
April 19 2021, 5:10 pm

తాడిపిత్రి టిడిపి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకరరెడ్డి తన ప్రతాపం మరోసారి చూపించారు.ఒక కాలనీలో పర్యటిస్తున్నప్పుడు , ఏవో సమస్యల గురించి అక్కడి జనం ప్రస్తావించితే ఆయనకు చిర్రెత్తుకు వచ్చిందంట. వెంటనే ఆయనకు తన ఎన్నికలలో ఎంత ఖర్చు అయిందో గుర్తుకు వచ్చిందట.రేయ్‌...ఎలక్షన్‌లో ఓటుకు రూ.2 వేలు తీసుకుని నాకు ఓటేశారు.. ఇప్పుడు పనులు చేయమని అడుగుతారా! నా... డకల్లారా.. పనులు చేయమని నన్ను అడిగే హక్కు మీకు లేదు’’ అని అన్నారట. ‘‘మీరు డబ్బు తీసుకోకుండా ఓట్లేసి ఉంటే.... నేను మీకు పనులు చేసిపెట్టాలి. డబ్బు తీసుకుని ఓట్లేశారు.. మీకు నన్ను అడిగే హక్కులేదు’’ అని ఆయన అన్నారట. డబ్బు తీసుకుని ఓట్లు వేసే వారికి బుద్ది లేకపోవచ్చు..కాని మరి ఆ డబ్బు ఇచ్చే నాయకులకు బుద్ది ఉన్నట్లేనా?

tags : jc prabhakar reddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info