A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ ఎవరి స్క్రిప్టు చదువుతున్నారో
Share |
April 19 2021, 5:26 pm

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపిపై చేసిన విమర్శలకు ఆ పార్టీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అద్దె మైకు మాదిరి మాట్లాడుతున్నారని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అంటే,పవన్ ఎవరో రాసిచ్చిన డైలాగులు చదువుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌కు అవగాహనా రాహిత్యం రోజు రోజుకూ పెరుగుతోందన్నారు. సినిమా షూటింగ్స్‌లో డైలాగులు చెప్పడం అలవాటైపోయిన ఆయన వేదికపైకి వచ్చినప్పుడు వాటిని చదివే నేపథ్యంలో వాస్తవాలు మర్చిపోతున్నారన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య 2019 మార్చిలో జరిగితే.. ఆ ఏడాది మే వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు.అప్పటి హత్యకు సంబంధించి పూర్తి ఆధారాలను అప్పటి ప్రభుత్వమే సేకరిస్తుందన్న విషయం పవన్‌ కల్యాణ్‌కు తెలియకపోవడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ విచారణలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసును తేల్చడం లేదని పవన్‌ అనడం చూస్తే ఆయనకు ఏ మాత్రం అవగాహన ఉందో సామాన్యునికి కూడా అర్థమవుతుందన్నారు. ఈ విధమైన డైలాగులే ఆయన స్క్రిప్ట్‌ చదువుతున్నాడనడానికి నిదర్శనమని పేర్కొన్నారు.

tags : kodali nani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info