A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి వాళ్లూ చెప్పులు విసిరారు
Share |
April 19 2021, 6:07 pm

ఎదుటివారికి నీతులు చెప్పే బిజెపి నేతలు ఒడిషా అసెంబ్లీలో చెప్పులు విసిరారన్న వార్త ఆందోళన కలిగించేదే. లోకాయుక్త సవరణ బిల్లులో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ, కొందరు బిజెపి సభ్యులు స్పీకర్ పోడియం వైపు చెప్పులు, కాగితాలు, మైక్రో పోన్ లు విసిరారట.దాంతో సభను స్పీకర్‌ వాయిదా వేశారు. ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్‌ అమల్లో ఉంటుందని, తక్షణమే వారు సభను వీడి వెళ్లాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలను, షెడ్యూల్‌ కన్నా ఐదు రోజుల ముందే, నిరవధికంగా వాయిదా వేశారు. మధ్యాహ్న భోజన విరామానికి ముందు, ఎలాంటి చర్చ జరపకుండానే లోకాయుక్త సవరణ బిల్లును ఆమోదించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది.

tags : bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info