A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అజ్ఞాతంలోకి మాజీ మంత్రి నారాయణ!
Share |
April 19 2021, 6:37 pm

నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ దయనీయ పరిస్థితిపై టిడిపికి మద్దతు ఇచ్చే ఒక మీడియానే ఒక కదనాన్ని ఇచ్చింది. దాని ప్రకారం గతంలో అనుభవించిన టిడిపి నేతలు ఎవరూ ఇప్పుడు పార్టీకి పనిచేయడానికి పెద్దగా ముందుకు రావడం లేదట. మాజీ మంత్రి పి.నారాయణ అయితే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. అదికారంలో ఉన్నప్పుడు నెల్లూరు టీడీపీలో ఉన్న సందడి.. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి కనిపించడం లేదట. ఆ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీకి ఒక్కసీటు కూడా రాలేదు. మాజీ మంత్రి నారాయణ రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు మాత్రమే అడపాదడపా కనిపిస్తున్నారని ఆ పత్రిక తెలిపింది.దీంతో టిడిపి ఎన్నికల ప్రచారం అంతంతమాత్రంగానే సాగుతోందన్నమాట.

tags : tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info