బెంగళూరు డ్రగ్స్ రాకెట్ కేసులో కొందరు తెలంగాణ ఎమ్మెల్యేలకు కూడా ప్రమేయం ఉందన్న వార్త కలకలం రేపుతోంది. పోలీసుల విచారణలో తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులకు డ్రగ్స్ సరఫరా చేశామని పోలీసులకు పట్టుబడ్డ నిందితులు వెల్లడించారు. దీంతో అక్కడ కూపీ లాగితే డొంకలు తెలంగాణలో కదులుతున్నాయి. ఈ విషయంలో విచారణకు రావాల్సిందిగా ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, పాలమూరు జిల్లాలకు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. నిజామాబాద్‌కు చెందిన ప్రజా ప్రతినిధి.. అధికారపార్టీలో కీలక వ్యక్తి అని సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ప్రతినిధి ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలో చేరిన వారు కావడం గమనార్హం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధికి కూడా సంబంధాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. tags : dugs case