A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కౌన్సిలర్ పదవికి పోటీలో మాజీ ఎమ్మెల్యే
Share |
April 19 2021, 5:49 pm

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాల్టీపై పట్టుకు మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి తీవ్రంగా యత్నిస్తున్నట్లుగా ఉంది. ఒకప్పుడు వారికి ఇది కంచుకోటగా ఉండేది. కాని గత ఎన్నికలలో జెసి సోదరుల కుమారులు ఇద్దరూ లోక్ సభకు, అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. తాజాగా మున్సిపల్ ఎన్నికలలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నారు. తాడిపత్రిలో 24వ వార్డు నుంచి ఆయన బరిలో దిగారు.కొంతకాలం క్రితం ఆయన రాజకీయ సన్యాసం ప్రకటించినా,తిరిగి ఎన్నికల గోదాలోకి దిగడం విశేషం. ప్రభాకర్‌రెడ్డిపై వైఎస్సార్‌ సీపీ నేత జగదీశ్వర్‌రెడ్డి పోటీ చేస్తుండగా, ప్రభాకర్‌రెడ్డి గెలుపుపై జేసీ దివాకర్‌రెడ్డి కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో 24వ వార్డు నుంచి జగదీశ్వర్‌ సోదరుడు జయచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని కౌన్సిలర్‌గా గెలిపించేందుకు జేసీ ఫ్యామిలీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

tags : jc

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info