A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ఒక మున్సిపాల్టీ కూడా గెలవదు
Share |
April 19 2021, 5:56 pm

విశాఖపట్నంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ విజయంపై ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధిస్తుందని అన్నారు. స్థానిక ఎన్నికల తరువాత టీడీపీ చాప్టర్‌ క్లోజ్‌ అవుతుందన్నారు. పురపాలక, కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఒక్కచోట కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం 85 నుంచి 90 శాతం స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. చంద్రబాబు ఎన్ని మాయమాటలు, అబద్ధాలు చెప్పినప్పటికీ ప్రజలు విశ్వసించే అవకాశం లేదన్నారు. చంద్రబాబు సినిమాకు ప్రజలు ముగింపు పలకబోతున్నారని విజయసాయి వ్యాఖ్యానించారు.
విశాఖను రాజధాని కాకుండా అడ్డుకుంటూ విశాఖపై విష ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని నగరంలో పర్యటిస్తున్నారని విజయసాయిరెడ్డి ప్రశి్నంచారు. ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు, లోకేశ్‌లను ప్రజలు తరిమికొట్టే సమయం వచి్చందన్నారు.

tags : vijayasaireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info