A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు టైమ్ లో అప్పుల మాటేమిటి!
Share |
April 19 2021, 6:03 pm

తన పాలనలో భారీ ఎత్తున అప్పులు చేసిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైసిపి ప్రభుత్వ అప్పుల గురించి విమర్శలు చేస్తున్నారు. పాలన చేతకాక అప్పులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒకవైపు కరోనా సమస్యతో దేశం అంతటా కేంద్రంతో సహా, రాష్ట్రాలు ఆదాయం కోల్పోయి అప్పులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందన్న సంగతిని విస్మరించి కావాలని ఆయన చేస్తున్న విమర్శలను ప్రజలు స్వీకరిస్తారా?
ఇరవై రెండు నెలల వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆయన ధ్వజమెత్తారు. ‘‘పాలన కోసం అప్పులు చేయాల్సి వస్తోందని పిట్టలదొర మంత్రి పిట్టకథలు చెబుతున్నారు. పాలన చేతకాని ముఖ్యమంత్రి చేస్తున్న అప్పులను ప్రజలు తీర్చాలా?’’ అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన విశాఖ జీవీఎంసీ పరిధిలోని గాజువాక, శ్రీహరిపురం, మల్కాపురం, జగదాంబ జంక్షన్‌, సీతంపేట, మద్దిలపాలెం ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించారు. అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి భారీ నిర్మాణాలు చేపడితే విద్వేషంతో దానిని నాశనం చేశారని, దీనివల్ల రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల ఆస్తి పోయిందని రోడ్‌షోల సందర్భంగా చంద్రబాబు ఆరోపించారు.
......................
కొద్ది రోజుల క్రితం లక్ష కోట్లు అన్నారు.ఇప్పుడు రెండు లక్షల కోట్లు అంటున్నారు. మరి తన హయాంలో చేసిన అప్పులు కూడా పాలన చేతకాకేనా? పైగా అప్పుడు అప్పులు తన మొహం చూసి ఇచ్చారని ప్రచారం చేసుకున్నారు కదా? ఏ ప్రభుత్వంలో అయినా మితిమీరి అప్పులు చేస్తే ఇబ్బంది కావచ్చు.దానిని హేతుబద్దంగా చెప్పడంలో తప్పు లేదు కాని,చంద్రబాబు కువిమర్శలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా?

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info