A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రచారానికి పవన్ కళ్యాణ్ వెళ్లనట్లేనా
Share |
April 19 2021, 6:17 pm

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం చేస్తారని కదనాలు వచ్చినా, ఆయన ప్రచారం చేయబోవడం లేదని అర్ధం అవుతుంది. ఆయన కేవలం ఒక వీడియో సందేశం ఇచ్చి వైసిపిని ఓడించాలని ప్రజలను కోరారు.పంచాయతీ ఎన్నికలలో జనసేనకు 27 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. వైసిపి నేతల ఆగడాలను జనసేన నేతలు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారని ఆయన చెప్పారు. వైసిపి ప్రభుత్వం హిట్లర్ ప్రభుత్వం మాదిరి వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.ఎదిరించే వ్యక్తులు లేకపోతే వీరి దాష్టికాలు ఇంకా పెరిగిపోతాయని ఆయన హెచ్చరించారు.
....................
వైసిపి దౌర్జన్యాలు నిజంగానే అంతగా పెరిగిపోతే జనసేనకు 27శాతం ఓట్లు ఎలా వచ్చాయని పవన్ కళ్యాణ్ అంటున్నారబ్బా!

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info