A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి కార్యకర్తపై బాలకృష్ణ దురుసుతనం
Share |
April 19 2021, 6:28 pm

అనంతపురం జిల్లా హిందూపూర్ టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన ఆగ్రహాన్ని పార్టీ కార్యకర్తపై ప్రదర్శించారు. ఒక కార్యకర్తను ఆయన కొట్టడం కలకలం రేపింది.
మున్సిపల్‌ ఎన్నికలలో భాగంగా హిందూపురంలోని 9 వార్డులో ఓ ఇంట్లోకి వెళ్లిన బాలకృష్ణ ప్రచారం చేస్తుండగా అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. ఇది చూసి కోపంతో తీవ్ర ఆవేశానికి లోనైన బాలయ్య.. అతనిపై చేయి చేసుకున్నారు. నా అనుమతి లేకుండా వీడియో తీస్తావా అని కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. పర్సనల్‌గా మాట్లాడుతుంటే వీడియో తీస్తావా, వెంటనే డిలీట్‌ చేయ్‌ అని ఆయన చెప్పారు.గతంలో కూడా ఒకసారి బాలకృష్ణ ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు. తన సభలకు ఆశించినంత స్పందన రాకపోవడంతో కూడా ఆయన అసహనంగా ఉన్నారని కదనాలు వస్తున్నాయి. కాగా తాను బూతులు తిట్టదలచుకుంటే ఎవరు చాలరని ఆయన వైసిపిని హెచ్చరించారు.

tags : balakrishna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info