A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయవాడ టిడిపిలో సీరియస్ తగాదా
Share |
April 19 2021, 6:35 pm

విజయవాడ తెలుగుదేశంలో రచ్చ పెరిగింది. లోక్ సభ సభ్యుడు కేశినేని తీరుపై మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న,మరో నేత నాగుల్ మీరా లు విరుచుకుపడ్డారని వార్తలు వచ్చాయి. తమకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన గురించి సమాచారం ఇవ్వరా అని వారు మండిపడ్డారు. రూట్‌ మ్యాప్‌ మార్చడానికి కేశినేని ఎవరని వారు ప్రశ్నించారు. ‘చంద్రబాబు రోడ్‌షోలో కేశినేని పాల్గొంటే.. మేం పాల్గొనం. మాకు ఏ గొట్టం గాడు అధిష్టానం కాదు’అని వారు తీవ్రంగా విమర్శలు చేశారు. ‘‘టీడీపీని కుల సంఘంగా మార్చాలని కేశినేని అనుకుంటున్నారా?. దమ్ముంటే కేశినేని ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలవాలి. కేశినేని చెప్పుచేతల్లో బీసీలు బతకాలా?. కేశినేని నాని చేసేవన్నీ చీకటి రాజకీయాలు’’ వారు ఫైర్ అయ్యారు.

tags : tdp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info