A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నారా!
Share |
April 19 2021, 6:49 pm

టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు బాగా ఫ్రస్టేషన్ లో ఉన్నట్లున్నారు. ఆయన విశాఖలో చేసిన ప్రసంగం చూస్తే ఆ భావన కలుగుతుంది. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం
‘ఎన్నికలలో పోటీచేసే మా పార్టీ అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారు. ఈ రాష్ట్రమేమైనా వీళ్ల అబ్బ సొత్తా? వీళ్లను ఇలాగా విడిచిపెడితే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు. చివరకు ఆడబిడ్డలకు కూడా రక్షణ కరువవుతుంది. అరాచక పాలకులకు మునిసిపల్‌ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలి’’ అని ఆయన ప్రజలను కోరారట. . దోపిడీ రాజ్యం, అరాచకపాలనపై మేధావులు స్పందించి ముందుకురావాలి. అల్లూరి సీతారామరాజులా ఉద్యమించాలి... బొబ్బిలి పులిలా గాండ్రించాలి.ఝూన్సీలక్ష్మీబాయిలా పోరాడాలి’’ అని కోరారు. ఆంధ్రుల పోరాటాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఏ-1, ఏ-2లు దొంగనాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. భూములన్నా.. డబ్బులన్నా ఈ సీఎంకు పిచ్చి అని విమర్శించారు. ‘‘రాష్ట్ట్రంలో ఆస్తులను జగన్‌ అమ్మేస్తున్నారు. భవిష్యత్తులో అందరినీ అమ్మేస్తారు’’ అని మండిపడ్డారు. ‘‘ఈ ముఖ్యమంత్రి ఒక పిల్లకుంక. నా అనుభవం అంత లేదు నీ వయసు. నీ తండ్రే నన్నుచూసి భయపడేవాడు. ఆయన కంటే నేనే ముందు సీఎం అయ్యాను. ఎవరైనా మంచి చేసి ఓట్లు అడుగుతారు. కానీ జగన్‌ బ్యాచ్‌ బెదిరించి ఓట్లు అడుగుతున్నారని ఆయన అన్నారు.

tags : chandrababu,frustrations

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info