అమరావతి భూముల కుంభకోణంపై విచారణకు అవకాశం ఇవ్వాలని, హైకోర్టు ఇచ్చిన స్టే ని ఎత్తివేయాలని ఎపి ప్రభుత్వం సుప్రింకోర్టును కోరింది. ఈ కేసులో ఎఫ్ ఐ ఆర్ నమోదు అయినవారిపై కఠిన చర్యలు తీసుకోబోమని, కాని దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘నిందితులపై కఠిన చర్యలు తీసుకోబోం. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేసినా మాకు అంగీకారమే. కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినా స్వాగతిస్తాం. కానీ దర్యాప్తు మాత్రం కొనసాగనివ్వండి’ అని ప్రభుత్వం తరపు న్యాయవాది రాజీవ్ ధవన్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలను తదుపరి విచారణలో పరిశీలిస్తామని, విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది.కాగా టిడిపి నేత వర్ల రామయ్య కేసులో సిట్తోపాటు మంత్రివర్గ ఉప సంఘం దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించిందని, దాన్ని ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే విజ్ఞప్తి చేశారు. tags : supremecourt, amavavati