A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్నికల్లో వలంటీర్ల పోన్ లు-హైకోర్టు ఆదేశాలు
Share |
April 19 2021, 4:48 pm

ఎపి లో మున్సిపాల్టీలలో వలంటీర్ల వద్ద ఉన్న పోన్ ల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ఒక అవగాహనకు వచ్చాయి. వలంటీర్లు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడానికి, అందులోని డేటా దుర్వినియోగం కాకుండా ఉండడానికి వీలుగా మున్సిపల్ కమిషనర్లు సూచించే అధికారుల వద్ద సెల్ పోన్టు ఉంచవచ్చని ఇరు పక్షాల అంగీకారం మేరకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే వలంటీర్లు తమ విధులలో భాగంగా వాడుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. సంబంధిత అధికారి పర్యవేక్షణలో వారు వాటిని ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వలంటీర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే వెసులుబాటు కూడా ఎస్‌ఈసీకి కల్పించింది.

tags : ap highcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info