A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అగ్రవర్ణ పేద మహిళలకు ఎపిలో చేయూత
Share |
March 7 2021, 11:10 am

ఎపిలో చేయూత కార్యక్రమాన్ని అగ్రవర్ణ పేదలకు కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బ్రాహ్మణ, వైశ్య ,కమ్మ,వెలమ, రెడ్డి,తదితర అగ్రవర్ణాలలోని పేద మహిళలకు మూడేళ్లపాటు ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్దిక సాయం చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించిందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. ఇప్పటివరకు ఎస్స,ఎస్టి, బిసి ,మైనార్టీ వర్గాలకు, అలాగే కాపు వర్గాలకు చెందిన మహిళలకు చేయూత కింద ఆర్దిక సాయం అందుతోందని ఆయన చెప్పారు.కాపు మహిళలకు ఇస్తున్న విదంగా ఇతర అగ్రవర్ణ పేదలకు పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని ఆయన చెప్పారు.45 ఏళ్ల వయసు నుంచి అరవై ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఈ సాయం చేస్తారు. కాగా సంక్షేమ పదకాల కాలెండర్ ను కూడా మంత్రివర్గం ఆమోదించిందని ఆయన చెప్పారు.

tags : perni nani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info