ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శలు కురిపించారు. ట్విటర్ లో ఆయన వ్యాఖ్యలు చేశారు. అవి ఇలా ఉన్నాయి.
‘‘ఎన్నికల ఫలితాలు ఊహించినట్టుగా రాకపోతే ఓటమిని సమీక్షించుకుంటాం అంటారు ఎవరైనా. నాలుగో విడత 41.7 శాతం ఓట్లు పడ్డాయని సొల్లు మాటలు చెబుతూనే ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసాడు చంద్రబాబు. ఇతను మారడు. తను భ్రమల్లో జీవిస్తూ అందరిని అందరినీ అదే భ్రాంతిలో ఉంచాలని చూస్తాడు"అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘పంచాయతీ తుది దశ పూర్తయ్యే సరికి తుప్పలు పట్టుకుపోయాడు తుప్పు నాయుడు. ఈ నకిలీ నాయుడు ప్రచారం చూసి జనమే గుణపాఠం చెప్పారు. వైఎస్సార్ సీపీ పేరుతో నకిలీ వెబ్సైట్ పెట్టి నైజీరియా మోసగాళ్ల ముఠా స్థాయికి దిగజారాడు. మున్సిపల్ ఎన్నికల్లోనూ టీడీపీకి ఇంతకంటే పరాభవం తప్పదంటూ’’ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
. ‘‘ వైఎస్ జగన్ 20 నెలల సంక్షేమ పాలనకు కృతజ్ఞతగా దక్కిన అఖండ విజయం ఇది. టీడీపీ అడ్రసు గల్లంతయి గ్రామాలన్ని వన్ సైడుగా మారడం వల్ల అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోయిందని’’ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. tags : vijayasaireddy