A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దుర్గ గుడిలో 13 మంది సస్పెన్షన్
Share |
March 7 2021, 11:28 am

విజయవాడ కనకదుర్గ గుడి లో జరిగిన అవినీతి నిరోధక శాఖ దాడుల ఫలితంగా ఐదుగురు సూపరింటెండెంట్ అధికారులతో సహా మొత్తం 13 మంది సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాలతో పాటు అన్నదానం, దర్శనాల టికెట్ల అమ్మకం, అమ్మవారి చీరల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అందించిన ప్రాథమిక సమాచారం మేరకు ఏడు రకాల విభాగాల్లో పనిచేసే సిబ్బందిని తక్షణమే సస్పెండ్‌ చేయాల్సిందిగా ఆలయ ఈవో సురేష్‌బాబును ఆదేశిస్తూ దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావు ఉత్తర్వులిచ్చారు.

tags : kanakadurga temple

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info