స్వామీజీలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం విశేషంగా ఉంది. ఆయన కొన్నిసార్లు కొందరు స్వామీజీల వద్దకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కాని ఆయనకు నచ్చని స్వామీజిపై చంద్రబాబు తీవ్ర విమర్శలు కురిపించడం విశేషం. మీడియాలో వచ్చిన కదనం ప్రకారం ఆయన ఇలా అన్నారు.
'స్వాముల పీఠాలు పైరవీలకు కేంద్ర స్ధానాలుగా మారాయి. డీజీపీ వెళ్లి ఒక స్వామిని కలుస్తారు. అవినీతి కేసులో సస్పెండైన ఈవో కూడా అదే స్వామిని కలుస్తున్నారు. సీఎం అక్కడకు వెళ్తుంటే అధికారులం తా క్యూ కడుతున్నారు. ఆ స్వామికి కానుకలు ఇస్తే కేసులన్నీ కొట్టుకుపోతాయని అనుకునే పరిస్థితులు వచ్చాయి. భోగాలు అనుభవించే వారు స్వాములవుతారా? పక్కనే రాములవారి తల నరికితే ఆ స్వామికి నోరు పెగలదు. పైగా క్షుద్ర పూజలు చేసి మమ్మల్ని చంపేస్తారట. చంపండి... చూద్దాం. "అని చంద్రబాబు వ్యాఖ్యానించారట. tags : chandrababu