A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జీవితంలో మొదటిసారి చూశా-చంద్రబాబు
Share |
July 31 2021, 5:35 am

ఎపి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా అతిశయోక్తులు ఉండకుండా ఉండవేమో! ఆయన పంచాయతీ ఎన్నికలలో టిడిపి కార్యకర్తలు వీరోచిత పోరాటం చేశారని చెబుతున్నారు.
ఎన్నో వేధింపులు, హింసలకు గురైనా, ఈ ఎన్నికల్లో పోరాడారని, వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు. ‘నాలుగో విడత లో టీడీపీ.. మిత్రులతో కలిసి 41ు శాతం పంచాయతీల్లో గెలిచింది. ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే మరో 10ు అదనంగా గెలిచేవాళ్లం అని ఆయన అన్నారు. అదే జరిగి ఉంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడే కూలిపోయి ఉండేది. అయినా వైసీ పీ పతనం ఆరంభమైందని ఈ ఎన్నికలు రుజువు చే శాయి. తలకిందులుగా తపస్సు చేసినా ఇక ఈ పతనా న్ని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. టీడీపీ ఏజెంట్లను బయటకు పంపి ఓట్లు మార్చివేశారు. లెక్కింపులో ఇన్ని అక్రమాలు నా రాజకీయ జీవితంలో మొదటిసారి చూశానని ఆయన అన్నారు.

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info