ఎపిలో వలంటీర్లకు బిరుదులు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు, వలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర బిరుదులతో సత్కరించడానికి గాను ఉత్తమ సేవలు అందిస్తున్నవారిని గుర్తించాలని ఆయన అధికారులకు సూచించారు. ఉగాది రోజున ఈ సత్కారం జరగాలని ఆయన సూచించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన సంక్షేమ పధకాల లబ్ది గురించి గుర్తు చేయాలని ఆయన అధికారులను కోరారు. ఇందుకు కార్యాచరణ సిద్దం చేయాలని ఆయన అన్నారు.
గ్రామాల్లోని ప్రభుత్వవ్యవస్థల వద్ద ఇంటర్నెట్ పనితీరును పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. tags : jagan, voluteers