ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ఎపి ఎన్నికల కమిషనర్ విఫలం అయ్యారంటూనే తమకు 4230 పంచాయతీలు వచ్చాయని టిడిపి అదినేత చంద్రబాబు చెప్పడం విశేషం.నాలుగో విడత లో 41.7 శాతం ఫలితాలు వచ్చాయని ఆయన అన్నారు. వైసిపి అధికార దుర్వినియోగం, అరాచకాలు లేకుంటే మరో పది శాతం గెలిచేవారమని ఆయన అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పతనం ప్రారంభం అయిందని ఆయన అన్నారు.ఎన్నికలను సక్రమంగా నిర్వహించామని ఎన్నికల కమిషన్ ఎలా చెబుతుందని ఆయన అన్నారు. టిడిపి ఇరవై రెండేళ్లు అధికారంలో ఉందని, రెండేళ్లకే వైసిపి మిడిసి పడుతోందని ఆయన అన్నారు. tags : chandrababu