ప్రముఖ నటుడు, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కూడా పంచాయతీ ఎన్నికలు షాక్ ఇచ్చాయన్న సమాచారం వచ్చింది. ఆయన నియోజకవర్గంలోని పంచాయతీలలో మెజార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంది. 38 పంచాయతీలకుగాను 30 చోట్ల వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించారని కదనం. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధికి షాక్ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో టీడీపీ ఓటమి పాలైంది.
పెనుకొండలోని 80 స్థానాల్లో 71 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయకేతనం ఎగరవేశారు. tags : balakrishna