ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టను పులివెందుల నియోజకవర్గ పంచాయతీలు కాపాడాయి. చివరి విడత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం సర్పంచ్ స్థానాలను అధికార పార్టీ అభిమానులు దక్కించుకుని విజయకేతనం ఎగుర వేశారు. ప్రతిపక్ష టీడీపీ మద్దతుదారులు ఈ నియోజకవర్గంలో ఒక్క పంచాయతీ కూడా దక్కించుకోలేకపోయారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి సొంత పంచాయతీ కసనూరులో సైతం టీడీపీ మద్దతుదారుడు అధికార పార్టీ అభిమానికి పోటీ కూడా ఇవ్వలేకపోయారని వార్త వచ్చింది.పులివెందుల నియోజకవర్గంలో 108 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 16వ తేదీ ఉపసంహరణ గడువు నాటికి ఏకంగా 90 పంచాయతీలను అధికార పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. 5 మండలాల్లోని 18 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా అన్నింటిలోనూ వైఎస్సార్సీపీ అభిమానులే విజయదుందుభి మోగించారు. కేవలం 8 గ్రామ పంచాయతీల్లో మాత్రమే టీడీపీ మద్దతుదారులు పోటీలో నిలిచినా, ఏ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు. నంద్యాలంపల్లి, పైడిపాలెం, దుగ్గనగారిపల్లె పంచాయతీలలో మొత్తంగా కేవలం 6 వార్డులే ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులకు దక్కించుకున్నారు. కాగా కుప్పంలో ప్రతిపక్ష నేత 74 పంచాయతీలను కోల్పోవడంతో పులివెందుల ఫలితాలకు ప్రాదాన్యత వచ్చింది. tags : jagan, new photo