ఎపిలో పదివేలకు పైగా పంచాయతీలను అదికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా, నాలుగు విడతల్లో కలిపి 13,097 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో మొత్తంగా 10 వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ అభిమానులు విజయ దుందుభి మోగించారు. ఒకటి, రెండు, మూడవ విడతల్లో ఎన్నికలు జరిగిన వాటిలో 7,869 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులను వైఎస్సార్సీపీ అభిమానులు చేజిక్కించుకున్నారు. నాలుగో విడతలోనూ ఎనభై శాతం వరకు గెలుచుకోవడం ఆ సంఖ్య పదివేల దాటింది.కాగా టిడిపి రెండువేల పంచాయతీలకు పరిమితం అయింది. tags : ysr congress,