విశాఖపట్నం జిల్లాలో టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి కాస్త ఇబ్బందికరమైన ఫలితమే. పంచాయతీ ఎన్నికలలో ఆయన బార్య ఓటమి చెందారన్న వార్త వచ్చింది. పరవాడ మండలం వెన్నెలపాలెంలో గతంలో రెండు దఫాలు సర్పంచ్‌గా పనిచేసిన తన భార్య మాధవీలతను ఈసారి కూడా పోటీకి నిలిపారు. ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు వెన్నెల అప్పారావు.. ఆమెపై 464 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. గ్రామంలోని మొత్తం 10 వార్డులనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులే గెలుచుకున్నారు. కాగా వైఎస్సార్సీపీ మద్దతుతో పెందుర్తి మండలంలోని రాంపురం గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేసిన ఎమ్మెల్యే అదీప్‌రాజ్ సతీమణి శిరీష ఘన విజయం సాధించారు tags : panchayat election