A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేన ఎమ్మెల్సీ అభ్యర్ది
Share |
March 7 2021, 12:13 pm

గుంటూరు, కృష్ణా జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసేన రంగంలోకి దిగుతోంది. న్యాయవాది గాదె వెంకటేశ్వరరావు పేరును పార్టీ లో ప్రతిపాదించారు. ఈ సందర్భంగా జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఉపాధ్యాయులను బ్రాందీ షాపుల్లో పద్దులు రాయడానికి, వైన్‌షాపుల ముందు క్యూలైన్లు సరిచేసే పనులకు ఉపయోగించి అవమానించారని మండిపడ్డారు. ఈ పరిస్థితులు మారాలంటే శాసన మండలిలో ఉపాధ్యాయుల సమస్యలు వినిపించడానికి బలమైన గొంతు అవసరమని, అలాంటి వ్యక్తే ప్రముఖ న్యాయవాది గాదె వెంకటేశ్వరరావు అని అన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. అమ్మఒడి, నాడు-నేడు వంటి పథకాల నిర్వహణ పనులను కూడా ఉపాధ్యాయులపై మోపారని విమర్శించారు.

tags : janasena

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info