నాలుగో దశ పంచాయతీ ఎన్నికలలో పలు చోట్ల గెలిచిన ఇతర పార్టీల అభ్యర్ధులను ప్రకటించకుండా, వైఎస్ఆర్ కాంగ్రస్ అభ్యర్దులకు అనుకూలంగా ఫలితాలను తారుమారు చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.ఈ విషయమై ఆయన ఎన్నికల కమిషనర్ కు ఒక ఫిర్యాదు చేస్తూ, రాత్రి 10గంటలకూ 40శాతం ఫలితాలు ప్రకటించలేదన్నారు. టీడీపీ మద్దతు అభ్యర్థులకు మూడంకెల మెజారిటీ ఉన్నా రీకౌంటింగ్ చేశారని, వైసీపీ నేతలతో పోలీసులు, అధికారులు కుమ్మక్కై, ఫలితాలపై ప్రభావం చూపారని అన్నారు. 4వ దశ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలు బలపర్చిన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచినా, ఫలితాలు దాచి, రాత్రి 8గంటల తర్వాత వైసీపీ బలపర్చినవారికి అనుకూలంగా ప్రకటనలు వెలువరిస్తున్నారని ఆయన అన్నారు. tags : chandrababu, results, change