A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
2022 నాటికి పోలవరం పూర్తి
Share |
March 7 2021, 10:48 am

లవరం జాతీయ ప్రాజెక్టు పనులు 2022 నాటికి పూర్తవుతాయని డీడీఆర్పీ (డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌) చైర్మన్‌ ఏబీ పాండ్య చెప్పారు. ప్రాజెక్టు డిజైన్లకు సంబంధించిన అంశాలపై పీపీఏ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్, రాష్ట్ర జలవరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డిలతో కలిసి శనివారం రాజమహేంద్రవరంలో ఆయన అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం స్పిల్‌ వే నిర్మాణంలో కీలకమైన 192 గడ్డర్ల అమరిక నేటితో పూర్తయిందన్నారు. స్పిల్‌ వే బ్రిడ్జి 1,128 మీటర్లకుగానూ 1,105 మీటర్లు పూర్తయిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అమర్చుతున్న గేట్లు ప్రపంచంలోనే అతి పెద్దవని ఆయన వెల్లడించారు. స్పిల్‌ వేకు 48 గేట్లకుగానూ ఇప్పటికే 29 గేట్లను అమర్చారని పాండ్య చెప్పారు. గేట్లకు హైడ్రాలిక్‌ సిలిండర్లు, పవర్‌ ప్యాక్‌లు అమర్చే పనులు వేగంగా సాగుతున్నాయని.. షెడ్యూలు ప్రకారం పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయన్నారు.

tags : polavaram project

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info