ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎపికి ప్రత్యేక హోదా అన్నది పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీ అని ,దానిని అమలు చేయాలని, అప్పుడు ఆంద్ర ప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ది చెందుతుందని ఆయన అన్నారు.విభజన వల్ల ఆంద్ర రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు సూచనలను జగన్ చేశారు.మాన్యుఫాక్చరింగ్ రంగం గురించి మాట్లాడుతూ
‘‘ఐదు రకాల అంశాలు తయారీ రంగానికి అవరోధాలుగా మారాయి. రుణాలపై అధిక వడ్డీల భారం, విద్యుత్ ఖర్చులు అధికంగా ఉండటం భూసేకరణలో ఆలస్యం వంటి అంశాలు తయారీ రంగానికి అవరోధంగా మారాయి. పీఎఫ్సీ, ఆర్ఈసీ రుణాలపై ప్రభుత్వం ఏడాదికి 10 నుంచి 11 శాతంవడ్డీ చెల్లించాల్సి వస్తోంది. తయారీ రంగంలో ముందున్న దేశాల్లో వడ్డీ రేట్లు 2 నుంచి 3 శాతం మించి ఉండటం లేదని’’ అని ఆయన అన్నారు.పోలవరం ప్రాజెక్టు కొత్త వ్యయ అంచనాలను ఆమోదించాలని కూడా ఆయన కోరారు. tags : jagan, special status