విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ పై బిజెపి అద్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్.పి జివిఎల్ నరసింహారావు తదితరులు ఎదురుదాడికి దిగడం విశేషం. ఒక్క ట్వీట్ ఆదారంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్,టిడిపి, కమ్యూనిస్టులు ఉద్యోగులను రెచ్చగొడుతున్నాయని వారు ఆరోపించారు.కేంద్రం ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకపోయినా ఉద్యమం ఏమిటని వీర్రాజు ప్రశ్నించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రధాన పోటీదారు అవుతుందన్న భయంతో వైసీపీ, టీడీపీ విశాఖలో డ్రామాలు ఆడుతున్నాయని ఆయన అన్నారు. మత మార్పిళ్లు, ఆలయాలపై దాడుల గురించి ప్రశ్నించకూడదనే వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు తమను ఏకాకిని చేసేందుకు కుట్రపన్నాయని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ఆలయాల ఘటనలపై సిట్ ఏర్పాటైనా రామతీర్థం నిందితులెవరో తేల్చలేదని, అదో కంటితుడుపు చర్యని అన్నారు. మున్నిపల్ ఎన్నికలు ముగిశాక కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు రథయాత్ర చేపడతామన్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలపై వీర్రాజు చికాకు పడడం విశేషం. దీనిని బట్టి ఏమి అర్దం అవుతోంది? tags : somu veeraju