తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజున 500 కోట్ల వ్యయంతో మొక్కలు నాటామని చెప్పుకుంటున్నారని, వీటిలో కనీసం 450 కోట్లు అదికార పార్టీవారు కొట్టేశారని బిజెపి నిజామాబాద్ ఎమ్.పి ధర్మపురి అరవింద్ ఆరోపించారు.ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో అవినీతి జరిగిందని అరవింద్ ఆరోపిస్తున్నారు.
రూ.500 కోట్లతో ఎన్ఆర్ఐ సెల్ పెడతామని ఇచ్చిన హామీని కేసీఆర్ విస్మరించారన్నారు. ఇప్పుడు పుట్టినరోజు ఖర్చుతోనే ఎన్ఆర్ఐ సెల్ పెట్టొచ్చుకదా అని అన్నారు. పుట్టినరోజుకు అంత ఖర్చు ఎలా పెడతారని ఆయన అన్నారు. సీఎం పుట్టిన రోజున కేటీఆర్ అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమై, దుబాయి వరకు వెళ్లారని, పరువు పోతుందని కేసీఆర్ తిరిగి వెనక్కి పిలిపించి పరువు కాపాడుకున్నారని అరవింద్ పేర్కొన్నారు. tags : aravind