ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సవాలు విసరడమే కాని, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నుంచి సమాదానం వస్తున్నట్లు లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలిచిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ మద్దతుదార్ల ఫోటోలు, వివరాలతో సహా వెబ్ సైట్ లో పెట్టామని, దమ్ము ఉంటే వాటిలో ఏ ఒక్కటైనా తప్పు ఉందేమో రుజువు చేయాలని చంద్రబాబుకు ఆయన సవాల్ చేశారు.చంద్రబాబు ఓటమిని హుందాగా ఒప్పుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు. ఏజెన్సీలో మొత్తం పంచాయతీలు తామే కైవసం చేసుకున్నామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్లో స్పందించారు. ప్రజలు చీత్కరించినా ఇంకా ఎవరిని మభ్యపెడతారని ఆయన ప్రశి్నంచారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులకు వచ్చిన మెజారిటీతో పోలిస్తే టీడీపీ ఎక్కడా కనీస స్థాయిలో పోటీ పడలేదని పేర్కొన్నారు.‘మావాళ్ల వివరాలను వెల్లడించడంలో మేమింత పారదర్శకంగా ఉంటే.. టీడీపీ గెలిచిన వారి వివరాలు ఎందుకు చెప్పడం లేదో అర్థం కావడం లేదు’ అన్నారు. tags : sajjala