A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయసాయి పాదయాత్ర ఆరంభం
Share |
March 1 2021, 6:38 am

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించేందుకు జరుగుతున్న పోరాటంలో భాగంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విశాఖలో పాదయాత్ర చేపట్టారు.జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులర్పించి పాదయాత్ర మొదలుపెట్టారు. మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయనతో పాటు పాదయాత్రలో ఉన్నారు. ఐదు నియోజకవర్గాల మీదుగా దాదాపు 25 కి.మీ మేర పాదయాత్ర సాగనుంది. సాయంత్రం 4.30 గంటలకు స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చ్‌ వద్ద భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగియనుంది.
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉక్కు ఉద్యమ పరిరక్షణ పాదయాత్ర సాగుతోందని విజయసాయిరెడ్డి తెలిపారు. ‘‘స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ.. ప్రైవేటీకరణ జరగకుండా పరిశ్రమను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించడంతో పాటు రుణాలను ఈక్విటీ రూపంలో మార్చాలని సీఎం కేంద్రానికి ప్రతిపాదించారని’’ ఆయన పేర్కొన్నారు.

tags : vijayasaireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info