విజయవాడ తెలుగుదేశం పార్టీలో వివాదం కొనసాగుతోంది. పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. కేశినేని నాని ఒక ప్రకటన చేస్తూ తన కుమార్తె శ్వేత అభ్యర్దిత్వాన్ని ఉపసంహరించుకోవాలని కోరుకుంటే తాము సిద్దం అని ఆయన అన్నారు. ఆరుగురు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్దులు ఓడిపోతే తాను గెలిచానని ఆ విషయం గుర్తించాలని ఆయన అన్నారు.ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా తాను వారి నియోజకవర్గాలలో పర్యటించవద్దని, వారి అనుమతి తీసుకోవాలని అంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. కాగా మరో నేత నాగుల్ మీరా తాను వైసిపిలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని,దీనిని ఖండిస్తున్నానని ప్రకటించారు. తానేమీ ప్రజారాజ్యం ,వైసిపిల నుంచి వచ్చి చేరిన నేతను కాదని పరోక్షంగా కేశినేని వర్గాన్ని ఉద్దేశించి విమర్శించారు. మొత్తం మీద ఈ వివాదం టిడిపికి చికాకు తెచ్చి పెడుతోంది. tags : kesineni nani