ఎపిలో ఎమ్.పిటిసి,జడ్పిటిసి ఏకగ్రీవ ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే ఆయా అభ్యర్దులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఫామ్ 10 ఇచ్చి ఉంటే వారికి సంబందించి నిలుపుదల చేయవద్దని, విచారణ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.ఎక్కడైనా పామ్ 10 ఇవ్వకపోతే ఆ ఏకగ్రీవాల ఫలితాలను వెల్లడించవద్దని హైకోర్టు ఆదేశించింది. పలువురు అభ్యర్ధులు ఎపి ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. ఎమ్.పిటిసి,జడ్పిటిసి ఎన్నికలలో ఏకగ్రీవాలు జరిగిన చోట ఎవరైనా పిర్యాదులు చేస్తే,మీడియాలో వ్యతిరేక వార్తలు వస్తే వాటిని పరిగణనలోకి తీసుకుని తనకు నివేదిక పంపాలని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులు ఆసక్తికరంగా ఉన్నాయి. tags : ap ,highcourt